మునుగోడులో ముదిరాజ్ లంతా టిఆర్ఎస్ వైపే
మునుగోడులో ముదిరాజ్ లంతా టిఆర్ఎస్ వైపే
మునుగోడు నియోజకవర్గ ముదిరాజ్ లంతా తెరాస వైపే ఉన్నారని, అభివృద్ధి వైపే ముదిరాజులు ఉండాలని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్ అన్నారు. మునుగోడులో నారబోయిన రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమైల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ హాజరయ్యారు.
మునుగోడు నియోజకవర్గంలో 50 వేల జనాభా మరియు 35 వేల ఓటర్లు కలిగి ఉన్నారని పలు అభివృద్ధి ఫలాలు అందిస్తున్న తెరాస పార్టీకి, ముఖ్యమంత్రి కెసిఆర్ కి పూర్తి మద్దతు తెలపాలని అన్నారు.
ముదిరాజ్ జాతి, ముదిరాజ్ ల ఐక్యత అభివృద్ధి కోసం త్వరలో భారీ మహా సభ ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. చండూర్ మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, జిల్లా అధ్యక్షులు వెలుగు రవి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు బోళ్ల వెంకట్ ముదిరాజ్, నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ముదిరాజ్ లు పాల్గొన్నారు. Vaddepalli Kashi Ram