బుచ్చింపేట వి.ఆర్.ఓ. ఆనందరావు సస్పెన్షన్
రాజాం మండలం బుచ్చింపేట గ్రామ సచివాలయంలో గ్రేడ్-1 వి.ఆర్.ఓ.గా పనిచేస్తున్న దుప్పాడ ఆనందరావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బుచ్చింపేట గ్రామంలోని స్మశాన వాటిక స్థలానికి సంబంధించి సర్వే నెం.70-2 లోని స్థలానికి
- By khaja --
- Thursday, 14 Jul, 2022
విజయనగరం జిల్లా: రాజాం మండలం బుచ్చింపేట గ్రామ సచివాలయంలో గ్రేడ్-1 వి.ఆర్.ఓ.గా పనిచేస్తున్న దుప్పాడ ఆనందరావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బుచ్చింపేట గ్రామంలోని స్మశాన వాటిక స్థలానికి సంబంధించి సర్వే నెం.70-2 లోని స్థలానికి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయకుండానే మ్యుటేషన్ సర్టిఫికేట్ కోసం ఫైల్ ప్రాసెస్ చేసిన కారణంగా సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వి.ఆర్.ఓ. తన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించడంలో విఫలం చెందినట్లుగా గుర్తించి ఆ వి.ఆర్.ఓ ను సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బుచ్చింపేట అంశంపై చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి విచారణ జరిపి జిల్లా కలెక్టర్ కు నివేదిక అందజేశారు. దీని ఆధారంగా కలెక్టర్ తదుపరి చర్యలు చేపట్టారు.
khaja