బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
బెజ్జూర్ మండలంలోని చిన్నసిద్ధాపూర్ గ్రామానికి చెందిన బూస లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతుండగా గ్రామ యువకులు బాధితురాలి వైద్య ఖర్చుల ఆర్థిక సాయం అందజేశారు. బాధితురాలి పరిస్థితి వివరిస్తూ మండల బీఆర్ఎస్ నాయకుడు జావిద్ అలీ సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో పలువురు స్పందించి ఆర్థిక సాయం చేయగా శనివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యుడు రమేష్, యూత్ సభ్యులు శ్రీకాంత్, వెంకటేష్, నాగేష్, ధనుంజయ్, చిరు, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
KOTA SAIKRISHNA