బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి

తెలంగాణ బీసీ డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో డాక్టర్ బాల శ్రీనివాస్ చే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు

తెలంగాణ బీసీ డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాల శ్రీనివాస్ జన్మదిన వేడుకలు బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో డాక్టర్ బాల శ్రీనివాస్ చే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అభివృద్ధి కోసం నిరంతరం తపన పడే గొప్ప వ్యక్తి బాల శ్రీనివాస్ అని, బీసీ డిగ్రీ కళాశాలల అధ్యాపకులను ఏకతాటిపైకి తీసుకొచ్చి నిరంతరం బీసీ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న గొప్ప సమరశీలి కొనియాడారు. భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నానన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నానన్నారు. జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ పాల్వాయి రవి, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, పట్టణ కార్యదర్శి ముక్కాముల శ్రీనివాస్ యాదవ్, గొబ్బిళ్ళ అనిల్ పాల్గొన్నారు.

Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)