ప్రధాని మోడీది వికృత రాజకీయ క్రీడ..cm

మోదీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడకుండా కుట్రలు, కుహకాలతో దేశంలో రాజకీయ వికృత క్రీడను కొనసాగిస్తున్నారు. దమన నీతితో ఈడీ, సీబీఐ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఇతర పార్టీల నేతలపై విచారణ నిలిపివేస్తున్నారనేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయ

మోదీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడకుండా కుట్రలు, కుహకాలతో దేశంలో రాజకీయ వికృత క్రీడను కొనసాగిస్తున్నారు. దమన నీతితో ఈడీ, సీబీఐ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఇతర పార్టీల నేతలపై విచారణ నిలిపివేస్తున్నారనేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. సుజనాచౌదరి, సువేందు అధికారి, ముకుల్‌రాయ్, సీఎం రమేష్‌ ,జ్యోతిరాదిత్య సింథియా లాంటి వారికి నోటీసులు ఇచ్చిన తర్వాత, వారిని పార్టీలో చేర్చుకోగానే ఆ కేసులన్నీ నిర్మా పౌడర్‌ మాదిరిగా తుడిచిపెట్టుకు పోతున్నాయి. బీజేపీ ఆఫీసులో తయారయ్యే వాట్సప్‌ వంటకాలతో రైతుబంధు, ఉద్యోగుల వేతనాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్రాల ప్రగతి దెబ్బతీసి దేశం గొంతు పిసుకుతున్నారు. తమ మిత్రులకు పోర్టులు, ఎయిర్‌పోర్టులు కట్టబెడుతున్నారు. సైన్యాన్ని కూడా వదిలిపెట్టకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఆర్మీలో ప్రయోగాలు సరికాదని రిటైర్డు సైనికాధికారులు చెప్తున్నారు. వృద్ధుడైన మోదీని తొలగించి యువ ప్రధానిని తీసుకురావాలి.

spr sp express

Comment As:

Comment (0)