ప్రజా జీవనానికి భంగం కలిస్తే చర్యలు తప్పవు : ఏసీపీ మంచిర్యాల తిరుపతి రెడ్డి

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల ఏసీపీ గారికి కార్యాలయంలో మంచిర్యాల సబ్ డివిజన్ పరిధిలోని ఆర్మీ ఉద్యోగాలకు ఎన్నికైన మరియు ప్రయత్నం చేస్తున్నటువంటి 30

రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల ఏసీపీ గారికి కార్యాలయంలో మంచిర్యాల సబ్ డివిజన్ పరిధిలోని ఆర్మీ ఉద్యోగాలకు ఎన్నికైన మరియు ప్రయత్నం చేస్తున్నటువంటి 30 మంది యువకులకు మంచిర్యాల ఏసీపి గారు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏసిపి గారు మాట్లాడుతూ... ప్రజా జీవనానికి విఘతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ప్రజా జీవనానికి భంగం కలిగినా, ఆస్తులను ధ్వంసం చేసినా చట్ట ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామన్నారు. వివిధ ఉద్యోగాలకు ప్రభుత్వం ప్రకటనలు వస్తున్నాయని, యువత లక్ష్యసాధనకు చదువుకోవాల న్నారు అల్లరులు, విద్వాంసం లకు పాల్పడేవారు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కంటే జీవితం అంధకారంగా మారుతుందన్నారు. ప్రస్తుతం వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో యువత ఉద్యోగాలకు సిద్ధంకావాలన్నారు. అల్లర్లు, నిర్వంసాలకు పాల్పడే వారు ఎలాంటి పరిస్థితిలో తప్పించుకోలేరని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ సీఐ నారాయణ జన్నారం ఎస్ఐ సతీష్,దండేపల్లి ఎస్ఐ సాంబమూర్తి సిసి నస్పూర్ ఎస్సై శ్రీనివాస్ లక్షెట్టిపేట ఎస్ఐ చంద్రశేఖర్, మంచిర్యాల పట్టణ ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.

khaja

Comment As:

Comment (0)