పేకాట ఆడితే కఠిన చర్యలు: సిర్పూర్ ఎసై.

కోడి పందెంరాయిళ్ళపై కేసులు కోడి పందాలు, పేకాట అడితే కఠిన చర్యలు తప్పవని సిర్పూర్ (టి) ఎస్ఐ. ఢీకొండ రమేష్ అన్నారు. శనివారం రాత్రి కోడి పందాల స్థావరం పై సిర్పూర్ (టి) పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

కోడి పందెంరాయిళ్ళపై కేసులు కోడి పందాలు, పేకాట అడితే కఠిన చర్యలు తప్పవని సిర్పూర్ (టి) ఎస్ఐ. ఢీకొండ రమేష్ అన్నారు. శనివారం రాత్రి కోడి పందాల స్థావరం పై సిర్పూర్ (టి) పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. సిర్పూర్ (టి) మండలం భూపాలపట్నం గ్రామ సమీపంలో కోడి పందాలు ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు కోడిపందాల స్థావరంపై దాడి చేసి ఎనిమిది మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుండి 8, 100 రూపాయల నగదు, మూడు పందెం కోళ్ళు స్వాధీనం చేసుకోని, 8 మంది పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వెల్లడించారు. కోడి పందాలు, పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని, గ్రామాలలో ప్రశాంతమైన వాతావరణం లో పండుగ వేడుకల జరుపుకోవాలని సిర్పూర్ (టి) ఎస్ఐ ఢీకొండ రమేష్ తెలిపారు.

Banka Srinivas

Comment As:

Comment (0)