తెలంగాణలో సర్కారీ కొలువుల జాతర
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. నేటి నుంచే 80,039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల విడుదల ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 91,142 ఖాళీలను గుర్తించగా అందులో 80,039 ఉద్యోగాలను నేర
- By khaja --
- Wednesday, 09 Mar, 2022
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. నేటి నుంచే 80,039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల విడుదల ప్రారంభమవుతుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 91,142 ఖాళీలను గుర్తించగా అందులో 80,039 ఉద్యోగాలను నేరుగా భర్తీ చేయనున్నారు. 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయనున్నారు. దీంతో 91,142 మంది ఉద్యోగల నియామకం జరిగినట్టవుతుంది.
అదే విధంగా తెలంగాణలో ఇక కాంట్రాక్టు ఉద్యోగులు అనే వారు ఉండరని, కాంట్రాక్టు ఉద్యోగం అనే పదమే వినపడవద్దని కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు వ్యవస్థ ఉండదని ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా నిరుద్యోగులకు మరో శుభవార్తను సీఎం కేసీఆర్ చెప్పారు. వయో పరిమితిని గరిష్టంగా 10 ఏళ్లకు పెంచారు. దీని ప్రకారం వయో పరిమితి వివరాలిలా ఉన్నాయి.
ప్రస్తుతం జనరల్ అభ్యర్దులకు వయో పరిమితి 34 ఏళ్లుగా ఉంది. దానిని 44 ఏళ్లకు పెంచారు.
ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్దులకు ప్రస్తుతం 39 ఏళ్లు వయోపరిమితి ఉంది. దానిని 49 ఏళ్లకు పెంచారు.
దివ్యాంగులకు వయోపరిమితి ప్రస్తుతం 44 ఏళ్లు కాగా దానిని 54 సంవత్సరాలకు పెంచారు.
ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ కొత్త వయో పరిమితి వర్తిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
పోలీసు, యూనిఫాం సర్వీసులకు ఈ వయోపరిమితి వర్తించదు.