తెలంగాణ సాయుధ పోరాట యోధుడికి ఘన నివాళులు

తెలంగాణ సాయుధ పోరాట యోధుడికి ఘన నివాళులు

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కనగల్ మండలం చర్లగౌరారం గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ చిలకరాజు మారయ్య చిత్రపటానికి గ్రామస్తులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రజాకార్లకు వ్యతిరేకంగా మారయ్య చేసిన తెలంగాణ సాయుధ పోరాట విషయాలు, గ్రామ సర్పంచిగా ఏకగ్రీవంగా 45 సంవత్సరాలు ఎన్నికైన విధానం గురించి మారయ్య అనుచరులు, స్నేహితులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనంతరం మారయ్య కుటుంబ సభ్యులను గౌరవించి చిలకరాజు మారయ్య విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. మారయ్య కుటుంబ సభ్యులు కోమరాజు చంద్రకళ, చంద్రమౌళి, రవి శ్రవణ్, అనుచరులు చింతల బ్రహ్మయ్య, మామిడాల మారయ్య, బ్రహ్మాల్ రెడ్డి, నారపాక ముత్తయ్య, రొయ్య వెంకట్ రాములు, నిమ్మల సత్తిరెడ్డి, బ్రహ్మచారి, శంకర్ రెడ్డి, వార్డు సభ్యులు కలకూరి నాగరాజు ATM, చింతల విజయ్ కుమార్ గౌడ్, నల్గొండ కమ్యూనిస్టు పార్టీ నాయకులు పాల్గొన్నారు. Vaddepalli Kashi Ram

Comment As:

Comment (0)