చింతలముని నగర్ లో రోడ్లు,కాలువలు నిర్మించాలి - సిపిఎం

కర్మూలు కార్పొరేషన్, ‌35వ వార్దు,చింతలముని నగర్, గనిగుంతల‌ ప్రాంతంలో రోడ్లు,కాలువలు వేయాలని సిపియం నగర కార్యదర్శీ వర్గ సబ్యులు సీహెచ్ సాయిబాబా డిమాండ్ చేశారు.శనివారం సిపిఎం ప్రతినిధి

కర్మూలు కార్పొరేషన్, ‌35వ వార్దు,చింతలముని నగర్, గనిగుంతల‌ ప్రాంతంలో రోడ్లు,కాలువలు వేయాలని సిపియం నగర కార్యదర్శీ వర్గ సబ్యులు సీహెచ్ సాయిబాబా డిమాండ్ చేశారు.శనివారం సిపిఎం ప్రతినిధి బృందంతో కలిసి ఆ ప్రాంతాన్ని పర్యటించారు.ఈ సందర్బంగా సీ హెచ్ సాయిబాబా మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి గనిగుంతల‌ ప్రాంతం లో సుమారు 250 మధ్య తరగతి,పేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు.ఇక్కడ కనీస సౌకర్యాలైన‌‌‌‌‌‌‌ రోడ్లు, కాలువలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ఇల్లు నిర్మించు కున్నప్రజలు వర్షాకాలంలో వర్షం నీరు,చుట్టూ పక్కల కాలనీల నీళ్ళు మొత్తం ఆ ప్రాంతంలో చేరుతున్నాయని చెప్పారు. దీనివల్ల ఇళ్లుమొత్తం మునిగిపొతున్నాయని,5 నెలలపాటు ఇళ్లు వదిలి ఇతర ప్రాంతాల్లో బాడుగలకు నివాసం చేయాల్సి వస్తుందన్నారు. వర్షాకాలం ముగిసిన అనంతరం సొంత‌ ఇళ్లకు చేరుకోవడం అలవాటుగా కొనసాగుతుందన్నారు.లక్షలు పెట్టి నిర్మించుకున్న ఇళ్లు శిదిలాలుగా మారుతున్నాయని అన్నారు.అక్కడి ప్రజలు ప్రశాంతంగా నివసించే పరిస్థితి లేదన్నారు.అక్కడ మున్సిపల్ అధికారులు, ఇంజనీర్లు మొత్తం నీటిని ఏ విదంగా తరలించాలో తెలియక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు.స్తానిక ప్రజలు గత‌‌ 15 సంవత్సరాల నుండి స్తానిక శాసన సభ్యుల వద్దకు ఎన్నిసార్లు తిరిగినా సమస్యను పరిష్కరించకపోగా నిదులు లేవని చెపుతున్నారన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ‌గనిగుంతల ప్రాంతంలో రోడ్లు,కాలువలు వెసి‌ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యుడు బి.కె.రామకృష్ణ, స్తానికులు‌ రంగుస్వామీ, మదు,కాలనీ మహిళలు పాల్గొన్నారు.

V.VIJAY KUMAR

Comment As:

Comment (0)