గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే కొనప్ప.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే కొనప్ప.
అసిఫాబాద్: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని సిర్పూర్(టి) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఆదివారం కౌటాల మండలంలోని వీర్ధండి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో జంగుబాయి దీక్షలతో కలిసి బూర్ అకిపెన్ జెండా పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రజలు భక్తి మార్గంలో నడవాలని తెలిపారు. వీర్ధండిలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కుమురం మాంతయ్య, చింతలమానెపల్లి ఎంపీపీ డుబ్బుల పాండ నానయ్య, సర్పంచ్ మడావి రేణుక పాల్గొన్నారు.
Banka Srinivas