ఎమర్జెన్సీ మెసేజ్.. టెన్షన్ అక్కర్లేదు
ఎమర్జెన్సీ మెసేజ్.. టెన్షన్ అక్కర్లేదు
- By Sai --
- Thursday, 21 Sep, 2023
ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ గురించి టెన్షన్ పడొద్దని కేంద్రం ప్రకటించింది. భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదల్లాంటి సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఇలాంటి అలర్ట్ మెసేజ్ పంపనున్నారు. దీనిని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రూపొందించగా.. ఈరోజు పరీక్షించారు. పెద్ద సౌండ్‌తో కూడిన మెసేజ్ అందరికీ రావడంతో.. యూజర్లు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటివరకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మెసేజ్ వచ్చింది.
Sai