జిల్లా కోర్టు ఆవరణలో సి.సి కెమెరాలు ప్రారంభించిన జిల్లా యస్.పి . రెమో రాజేశ్వరి
ఈ రోజు జిల్లా కోర్టు ఆవరణలో టూ టౌన్ పోలీసు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గౌరవ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి గారు, గౌరవ జిల్లా జడ్జి గారు జగ్జీవన్ కుమార్ ప్రారంభించారు . ఈ సందర్భంగా గౌరవ జడ్జి గారు మాట్లాడుతూ కోర్టుకు విధాలుగా సిసి కెమెరాలు ఉపయోగపడతాయని
- By khaja --
- Friday, 11 Mar, 2022
ఈ రోజు జిల్లా కోర్టు ఆవరణలో టూ టౌన్ పోలీసు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గౌరవ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి గారు, గౌరవ జిల్లా జడ్జి గారు జగ్జీవన్ కుమార్ ప్రారంభించారు . ఈ సందర్భంగా గౌరవ జడ్జి గారు మాట్లాడుతూ కోర్టుకు విధాలుగా సిసి కెమెరాలు ఉపయోగపడతాయని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నిరోధిస్తాయి అని వాటి ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. అలాగే జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూలో ప్రజా సముదాయం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఒక్క సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలను నియంత్రించవచ్చని మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో సిసి కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయని, వీటిని ప్రతి చోట ఏర్పాటు చేయడం ద్వారా నేర రహిత సమాజాన్ని నిర్మించడంలో సిసి కెమెరాలు కీలకంగా మారుతున్నాయని అన్నారు. అనేక కేసులును ఛేదించడంలో, దొంగతనాలు జరిగినప్పుడు సిసి కెమెరాల ద్వారా నిందితులను గుర్తించినట్లు తెలిపారు. ఈ సిసి కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని అప్పుడే నేరాలను నియంత్రించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రశాంత వాతావరణం కల్పించేలా చేయడంలో సిసి కెమెరాలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్బంగా టూ టౌన్ పోలీస్ వారి విజ్ఞప్తి మేరకు కోర్టు ఆవరణలో 8 కెమెరాలను ఏర్పాటుచేసిన దాత మహేందర్ గారిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఇతర జడ్జీలు, DSP వెంకటేశ్వర్ రెడ్డి, టూ టౌన్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ,సంపత్ తదితరులు పాల్గొన్నారు .
khaja