ఆశ వర్కర్లపై వేధింపులు మానుకోవాలి.ఆశ వర్కర్ల కలెక్టరేట్ మహా ధర్నాలో నాయకుల పిలుపు.
ఆశ వర్కర్లకు ఎన్సీడీ పేరుతో పి,హెచ్ సి లలోని ఏఎన్ఎంలు తీవ్రమైన ఒత్తిడికి గురిచేసి,బెదిరించి పనిచే యిస్తున్నారని ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి డి.రమీజా బి అన్నారు.గురువారం కలెక్టరేట్
- By V.VKR --
- Thursday, 14 Jul, 2022
ఆశ వర్కర్లకు ఎన్సీడీ పేరుతో పి,హెచ్ సి లలోని ఏఎన్ఎంలు తీవ్రమైన ఒత్తిడికి గురిచేసి,బెదిరించి పనిచే యిస్తున్నారని ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి డి.రమీజా బి అన్నారు.గురువారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆశా ఆశ వర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం మహా ధర్నా నిర్వహించారు.ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా అ ధ్యక్షురాలు శివలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ ధర్నాకు సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ,ఆశ యూనియన్ గౌరవాధ్య క్షులు జే.నాగేశ్వరావు,జిల్లా నాయకులు ఏం.గోపాల్ హాజరై మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పెరిగిన ధరలకనుగుణంగా గౌరవ వేతనం రూ.15 వేలకు పెంచాలన్నారు.పని భారం తగ్గించాలని,రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు ఇవ్వాలని,ఆశలకు సంబంధం లేని పనులు చేయించరాదని,వేధింపులు, బెదిరింపులు గురిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాల ని డిమాండ్ చేశారు.ప్రభుత్వ సెలవులు, మేటర్నిటీ లీవులు అమలు చేయాలని,సంక్షేమ పథకాలు ఆశాలకు వర్తింపచేయాలని, నాణ్యమైన సెల్ ఫోన్స్ 4జి సిమ్ములు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. అనంతరం డి.ఎం అండ్ హెచ్ ఓ,ఏఓ నాగవరప్రసాద్ కువినతి పత్రం అందించారు.బదినే హల్ లో ఆఫీసు ఉద్యోగి, ఆస్పరిలో మెడికల్ ఆఫీసర్,హుసేనాపురం సెంటర్లలో ఏఎన్ఎం వేధింపులు చాలా అధికంగా ఉన్నాయని, వీటిని అరికట్టకపోతే ఆశా వర్కర్స్ యూనియన్ గా జిల్లా వ్యాప్త ధర్నాలు నిర్వహిస్తామని ఏఓకు విన్నవించారు.ఈ ధర్నాలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు నాగమణి,అలివెలమ్మ,సాలమ్మ,శ్రీదేవి, శేషమ్మ, వెంకటమ్మ, ఈశ్వరిబాయి త్రివేణి, సరోజ,ద్రాక్షాయిని, తదితరులు పాల్గొన్నారు.
V.VKR