అహంకారం తో కల్లిబొల్లి మాటలను మానుకోవాలని కిషన్ రెడ్డి ఘాటుగా విమర్శ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు రోజుల పాటు విపరీతంగా ప్రపంచ స్థాయిలో పరిశోధన చేసి రెండు గంటలు ఏకధాటిగా మీడియా సమావేశం పెట్టి చెప్పిందే చెప్పాడని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.నిన్న కేసీఆర్‌ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడ్డ విషయం తెలిస

హైదరాబాద్ :తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు రోజుల పాటు విపరీతంగా ప్రపంచ స్థాయిలో పరిశోధన చేసి రెండు గంటలు ఏకధాటిగా మీడియా సమావేశం పెట్టి చెప్పిందే చెప్పాడని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.నిన్న కేసీఆర్‌ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. కేసీఆర్‌ వ్యాఖ్యాలపై కిషన్‌రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సొంత డబ్బా పరనింద అన్నట్టు అసలు విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడి ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతిని మర్చిపోయి తన చిల్లర మాటలు చిల్లర వేషాలతో మరోసారి కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీపై అన్నిటికంటే ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారని మండిపడ్డారు

spr sp express

Comment As:

Comment (0)